Sunday, 02 August 2026 02:51:43 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఉదయం 11 గంటల వరకు జిల్లాలో 29.30% పోలింగ్ నమోదు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 11 February 2026 11:53 AM Views : 292

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపాలిటీల మరియు మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా ఉదయం 11.00 గంటల వరకు మొత్తం 29.30 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో మొత్తం 3 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 106 వార్డుల్లో ఏర్పాటు చేసిన 288 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి అర్హులని, అందులో పురుషులు 88,738 మంది, మహిళలు 96,572 మంది, ఇతరులు 38 మంది ఉన్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల వరకు మొత్తం 54,298 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. పట్టణాల వారీగా చూస్తే అశ్వరావుపేట మున్సిపాలిటీలో 45.18 శాతం పోలింగ్ నమోదు కాగా, 16,850 మంది ఓటర్లలో 7,613 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,34,775 మంది ఓటర్లలో 38,362 మంది ఓటు వేయగా, అక్కడ 28.46 శాతం పోలింగ్ నమోదైంది. యెల్లందు మున్సిపాలిటీలో 33,723 మంది ఓటర్లలో 8,323 మంది ఓటు హక్కు వినియోగించుకుని 24.68 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, షెడ్లు, వీల్‌చైర్లు తదితర మౌలిక వసతులు కల్పించామని, వృద్ధులు మరియు దివ్యాంగులు సౌకర్యవంతంగా ఓటు వేయేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. మిగిలిన సమయాన్ని వినియోగించుకుని ఓటర్లు స్వేచ్ఛాయుత, భయరహిత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :