తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన దరఖాస్తు ఎంక్వయిరీలో ఇందిరమ్మ గృహ మంజూరు లో స్థలం ఉండి కూడా స్థలము లేని (ఎల్ టు) జాబితాలో తమ పేర్లు నమోదు అయ్యాయని రామవరం చెందిన చల్ల రమ్య, బోదాసు జ్యోతి లు గ్రీవెన్స్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముని గడప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్డీవో కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీవోకు వివరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉండి కూడా స్థలములేని జాబితాలో (ఎల్ టు) ప్రచురించారని అన్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా సుమారు 30 పేర్లు ఎల్ వన్ లో నమోదు కావలసిన పేర్లను ఎల్ టు లో ప్రచురించడం జరిగిందని ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించి వారి పేర్లును ఎల్ వన్ జాబితాలోకి తీసుకురావాలని ఆర్డీవో వివరించారు. వినతి పత్రం అందించిన వారిలో ఉప్పతల శ్రీనివాస్, చల్ల రమ్య ,బోదాసు జ్యోతి బోదాసు సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ