Tuesday, 03 November 2026 02:37:54 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

మణుగూరు ప్రాజెక్ట్ లోని శేషగిరి నగర్ అంగన్వాడి కేంద్రమును సందర్శించి TGSCPCR మెంబర్ కంచర్ల వందన గౌడ్

Date : 07 August 2026 05:59 PM Views : 148

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : TGSCPCR (Telangana State Commission for Protection of Child Rights), Hyderabad విజిట్‌లో భాగంగా TGSCPCR మెంబర్ కంచర్ల వందన గౌడ్ మణుగూరు ప్రాజెక్ట్ లోని శేషగిరి నగర్ అంగన్వాడి కేంద్రమును సందర్శించి అన్నప్రాసన కార్యక్రమము నందు పాల్గొనడం జరిగింది మరియు ప్రాధమిక పాఠశాల నిర్వహణ, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు,బాలలకు అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలు, అంగన్వాడి కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, బాలల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. అదేవిధంగా చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకొని, చిన్నారులను ఆత్మీయంగా మాట్లాడి వారి అభ్యాసాన్ని పరిశీలించారు. తదుపరి చిల్ద్రెన్ హోం (బాలికలు), మణుగూరు ను సందర్శించి,పరిసరాలను వారికి గల వసతులను పరిశీలించడం జరిగింది . బాలికల చదువులు, వారి గల నైపుణ్యాలను, ఇబ్బందుల గురించి వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. చిల్ద్రెన్ హోం లో ఉంటున్న బాలికలను దండిచ వద్దని ఆదేశించడమైనది మరియు బాలికలతో స్నేహపూర్వకంగా మెలగాలని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండ చూసుకోవాలని సలహాలు సూచనలు చేసారు . మరియు బాలికల తో కలిసి మధ్యాహ్న భోజనం చేసారు . చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకొని, బాలికల తో ఆత్మీయంగా మాట్లాడి వారి అభ్యాసాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి భద్రాద్రి కోత్తగూడెం జిల్లా ఆంధ్రప్రదేశ్,చత్తిస్గడ్ ,ఒరిస్సా రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న కారణంగా ఎక్కువగా వలస కార్మికులు మన జిల్లాకు రావడం మరియు బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నందు వలన ఆ మూడు రాష్ట్రాల సంభందిత అధికారులతో కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం నందు జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి జె. యం. స్వర్ణలత లేనినా , గౌరవ child welfare కమిటి మెంబెర్స్ , శ్రీమతి సుమిత్ర దేవి మరియు శ్రీ . అంబేద్కర్ , మణుగూరు ప్రాజెక్ట్ CDPO శ్రీమతి .జయలక్ష్మి , మణుగూరు ప్రాజెక్ట్ ICDS సూపర్వైజర్లు, జిల్లా బాలల సంరక్షణ అధికారిణి శ్రీమతి. హరి కుమారి మరియు సిబ్బంది, DCPU, CHL సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :