Tuesday, 03 November 2026 09:32:14 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

దళిత మహిళపై దాడి చేసిన ఇన్స్ స్పెక్టర్ ను తక్షణమే సర్వీస్ నుండి తొలగించాలి : బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 08 August 2024 03:37 PM Views : 529

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం నెపంతో దళిత మహిళపై అమానుషంగా దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్ స్పెక్టర్ రామిరెడ్డిని వెంటనే సర్వీస్ నుండి తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం పార్టీ శ్రేణులతో పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ షాద్ నగర్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సునీత అనే దళిత మహిళపై దొంగతనం నెపంతో కాలు విరిగి ఉన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమె భర్తను,మైనర్ కుమారుడిని తీవ్రంగా పోలీస్ స్టేషన్ లో కొట్టిన ఘటనకు రేవంత్ రెడ్డి

ప్రభుత్వం నైతిక భాధ్యత వహించాలని,దాడులు చేసిన అధికారులను కేవలం సస్పెండ్ చేసి,అటాచ్ చేస్తే బాధిత మహిళకు న్యాయం చేసినట్టు కాదని బాధితురాలు ఎస్సీ కాబట్టి అతని పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చేసి,హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.బాధిత మహిళకు ప్రభుత్వం రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.పోలీస్ అధికారి బాధిత మహిళను హింసిస్తే మరో పోలీస్ అధికారి ఎంక్వైరీ చేయడం వలన పారదర్శకత లోపిస్తుంది కావున నిష్పక్షపాతంగా విచారణ జరిగి బాధిత మహిళకు న్యాయం జరగాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,కందుల విష్ణు,భూక్యా లీలా,కవిత,మౌనిక తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :