తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 18 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం జరిగినది. 41 రోజు భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో మాల ధారణ లో ఉన్నటువంటి 36 మంది అయ్యప్ప స్వాములుకు బత్తుల వెంకటేశ్వర్ల గురు స్వామి ఆధ్వర్యంలో కొత్తగూడెం అయ్యప్ప స్వామి గుడి పూజారి కృష్ణమూర్తి గురుస్వామి స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని జరిపించారు. గ్రామస్తులంతా ఇరుముడితో శబరిమలై వెళ్తున్న స్వాములకు పూలమాలలు వేసి దీక్షలు సమర్పించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ