తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ సూచనల మేరకు, కొత్తగూడెం డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ప్రతాప్ కొత్తగూడెంలోని GGHలో అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రదాన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. ప్రతాప్ మాట్లాడుతూ, నేత్రదానం ద్వారా మరణానంతరం అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని , సమాజంలోని ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. నేత్రదానానికి సంబంధించిన అపోహలు, వాస్తవాలు మరియు కార్నియా దానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు . నేత్రదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, ఎక్కువ మందిని నేత్రదానానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో GGH వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, PMO డా. తిరుమలరావు, అగర్వాల్ ఐ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. “నేత్రదానం – మరణానంతరం మరొకరి జీవితంలో వెలుగులు నింపే మహాదానం” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ