తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బిజెపి ఆధ్వర్యంలో శక్తి కేంద్రాలు ఏర్పాటు.జిల్లా బిజెపి అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల తో.56వ డివిజన్ శక్తి కేంద్రం ఇన్చార్జిగా బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాయత్రి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "సర్" ఎన్నికల ప్రక్రియను అర్థమయ్యే విధంగా చెప్పేందుకు వీలుగా బిజెపి ఆధ్వర్యంలో శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం బిజెపి అనుబంధ మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ లో శక్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శక్తి కేంద్రానికి ఇన్చార్జిగా ఉన్న జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాయత్రి మాట్లాడుతూ బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సమక్షంలో జిల్లా అధికారులు నిర్వహిస్తున్న" సర్" సహాయ కేంద్రం ద్వారా సామాన్య ఓటర్లను సైతం కాపాడుకునే విధానం పై చైతన్యం చేయనున్నట్లు తెలిపారు.56వ డివిజన్ పరిధిలో గల అజ్మత్ కిరాణా షాపు వద్ద139, 140, 141, 142 బూత్ ఓటర్లకు "సర్" సహాయ కేంద్రం, ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ ఇప్పటి వరకు ఇంకా ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోని వారు ఈ సహాయ కేంద్రాల వద్దకు వచ్చి బిఎల్వో లు తమకు ఇచ్చిన ఫారాలను పూర్తి చేసుకుని తప్పకుండా తమ వివరాలని సంబంధింత బిఎల్ఓ అధికారులకు ఇచ్చి తమ ఓటు హక్కు పత్రాలను బి ఎల్ ఓ లకి అంద చేయవలసిందిగా కోరడం జరిగింది. ప్రతి ఓటరుకు అవగాహన కల్పిస్తూ వారికి సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, బిజెపి ఆఫీస్ సెక్రెటరీ దురిశెట్టి కుమార్, బి.ఎల్.ఓ.2 పిల్లి వేణు వాసవరావు, బి ఎల్ ఓ శైలజ, గౌసియా, జ్యోతి, అలాగే స్థానిక ఓటర్లు గౌస్, హమీద బేగం, వినయ్ కుమార్, సుప్రజ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ