Monday, 03 August 2026 05:06:17 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Date : 26 March 2026 10:48 AM Views : 214

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రక్తదానానికి యువత ముందుకురావాలి: డీఎస్పీ ఆదినారాయణ రక్తదానం చేయడానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పిలుపునిచ్చారు. తద్వారా ప్రమాదంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అంది ప్రాణాలు దక్కుతాయని చెప్పారు. యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలు ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోగల కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డీఎస్పీ ఆదినారాయణ ప్రారంభించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడవచ్చునని, ప్రతీ ఒక్క వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునన్నారు. క్లబ్‌ వ్యవస్థాపకులు జె.బాలు మాట్లాడుతూ ప్రతీ ఇంటి నుండి ఒక్క రక్తదాత ఉండేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ గ్రూపు రక్తం అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చునని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకకుండా ఎవరూ చనిపోకూడదనేది తమ క్లబ్‌ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. కేవలం అవసరమైన సమయంలో రక్త దాతల నుండి రక్తం అడగడమే కాకుండా స్వయంగా ప్రతి ఒక్కరు రక్తదాతలు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వాస్పత్రుల్లో రక్తదానం చేయాలని, తద్వారా ఆస్పత్రుల్లో ఆయా గ్రూపుల రక్తం నిల్వలు ఉండి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుతాయని అన్నారు. ఇప్పటివరకు తమ క్లబ్‌ ద్వారా 46,500 మంది బాధితులకు రక్తదానం చేసినట్లు తెలిపారు. అసిస్టెంట్‌ మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంగం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ వాహనదారులు రక్షణ చర్యలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునని, వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. దాతలు చేసే రక్తదానం ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఈ శిబిరంలో 37 మంది రక్తదానం చేసినట్లు బాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.ఐ. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్‌ ప్రవీణ్‌ రెడ్డి, వీరునాయక్, భరత్, రాజేష్, జుబ్బు, జయశ్రీ, కమలారాణి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :