Thursday, 17 September 2026 09:08:49 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

పారదర్శకంగా లాటరీ పద్ధతిలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల లబ్ధిదారుల ఎంపిక : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 30 July 2026 01:40 PM Views : 152

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రధాన మంత్రి జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (PM-JUGA) పథకం కింద మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల, ఆదాయ వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మంజూరు చేసిన ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల లబ్ధిదారులను బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ అధ్యక్షతన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు కమిటీ సమక్షంలో లాటరీ విధానాన్ని అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ అర్హులైన ప్రతి మత్స్యకారుడు ప్రభుత్వ సహాయాన్ని పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి జి. శివ ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో ద్విచక్ర వాహనాల కోసం 274 మంది మత్స్యకారులు, మూడు చక్రాల వాహనాల కోసం 26 మంది మత్స్యకారులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మత్స్యశాఖ డైరెక్టర్, హైదరాబాద్ కార్యాలయం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 51 ద్విచక్ర వాహనాలు, 12 మూడు చక్రాల వాహనాలు కేటాయించినట్లు తెలిపారు. కేటాయించిన వాహనాల సంఖ్య కంటే దరఖాస్తులు అధికంగా రావడంతో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన PMMSY జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. లాటరీ ప్రక్రియను కమిటీ సభ్యులు, జిల్లా మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారుల సమక్షంలో పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించి ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసినట్లు తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల మేరకు తదుపరి ప్రక్రియ పూర్తి చేసి వాహనాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్, డీఆర్‌డీఓ ఎం. విద్యా చందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి. నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కె. మహేశ్వరరావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వి. రామిరెడ్డి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. టి. భరత్, జిల్లా మత్స్యశాఖ అధికారి జి. శివ ప్రసాద్ (కన్వీనర్), ప్రగతిశీల మత్స్యకారుడు పిట్టల సాయిలు, జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మత్స్యకారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :