Friday, 18 September 2026 02:05:02 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి.

Date : 24 May 2026 07:08 PM Views : 139

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూపోరాటాల యోధుడు నల్లమల గిరిప్రసాద్. పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీశాలి. నేటి తరం కమ్యూనిస్టులకు ఆయన జీవితం ఒక దిక్సూచి. గిరిప్రసాద్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా.సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. భూపోరాటాల యోధుడు నల్లమల గిరిప్రసాద్ అని, ఆయన ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సిపిఐ మాజీ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు నల్లమల గిరిప్రసాద్ 29వ వర్ధంతిని ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో గిరిప్రసాద్ పోషించిన పాత్ర అజరామరమైనదన్నారు. తన ఉన్నత విద్యను, ఆస్తులను వదిలి సమాజ శ్రేయస్సు కోసం, పేద ప్రజల భూమి హక్కుల కోసం లక్షలాది ఎకరాలను పంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తూ ఎనలేని అభివృద్ధిని సాధించారని, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచిన ధీశాలి అని కొనియాడారు. పోలీసుల కాల్పుల్లో అయన ఒంటిపై పడిన మచ్చ మినహా ఎలాంటి మచ్చ లేని కమ్యూనిస్టు నొదుదని కొనియాడారు. ప్రస్తుత తరం కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా సమితి సభ్యులు భూక్యా శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, నాయకులు మాతంగి లింగయ్య, పి సత్యనారాయణ చారి, షాహీన్, కైసర్, జలీల్, మిర్యాల రాము, చోటు షరీఫ్, బాజోజు రవి, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :