తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రికొత్తగూడెం నవంబర్ 4 (తెలుగు వెలుగు) జూలూరుపాడులో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ ఇంటి పైన గృహ విద్యుత్ కొరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముక్తి బిజిలి యోజన పథకం కింద మంజూరైన టాటా త్రీ కిలో వాట్ సోలార్ ప్లాంట్ ను బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మరియు రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు సోలార్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోలార్ విద్యుత్తును ఉపయోగించడం వల్ల కార్బన్డయాక్సైడ్ తగ్గుతుందనీ రాబోయే కాలంలో బొగ్గు ఉత్పత్తులు తగ్గుతున్నాయి, ఉచితంగా సూర్య రష్మి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కావున ప్రధానమంత్రి మోడీ సోలార్ విద్యుత్ ప్లాంట్ పెట్టుకున్న వారికి 78 వేల రూపాయలు సబ్సిడీ అందిస్తున్నారు . అదేవిధంగా మిగతా మొత్తం అమౌంట్ ని బ్యాంకు లోన్ ద్వారా తీసుకున్నట్లయితే 70 పైసలు వడ్డీతోని 10 సంవత్సరాలు వాయిదాల పద్ధతితో కట్టుకోవచ్చునని వివరించారు.కావున ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ విద్యుత్తుకు ప్రాధాన్యత పెరిగినది అని బిజెపి జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్యామ్ రాథోడ్, వైరా అసెంబ్లీ కనెరు నెల్లూరు కోటేశ్వరరావు, చంద్రశేఖర్ బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ