తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థానిక లక్ష్మీదేవిపల్లిలోని వివేకవర్ధిని డిగ్రీ & పీజీ కళాశాల యందు 13/08/2026 గురువారం నాడు జరిగిన ప్రాంగణ నియామకాల్లో 40 మంది అభ్యర్థులు పాల్గొనగా 14 మంది అర్హత సాధించారు అని కలశాల ప్లేస్ మెంట్ అధికారిణి B. ఉమ తెలిపారు.కళాశాల వైస్ చైర్మెన్ ప్రణవ్ కృష్ణ అర్హత పొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు. వివేకవర్ధిని డిగ్రీ & పిజీ కళాశాల ప్రిన్సిపల్ CH. సతీష్ మాట్లాడుతూ గతం లో మా కళాశాల లో అనేక ప్రాంగణ నియామకాలు జరిగాయని రాబోవు రోజుల్లో కూడా విద్యార్థులను దృష్టి లో పెట్టుకొని మరెన్నో నియామకాలు జరపబోతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో లో భాగంగా కళాశాల ఛైర్మెన్ MV చౌదరి, కళాశాల డీన్ సాయి కృష్ణ మరియు ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ