తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెహల్గాంలో జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిని వ్యతిరేకిస్తు టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు అన్నారు. పెహల్గాంలో యాత్రికులపై జరుగిన టెర్రరిస్టుల దాడికి నిరసనగా, మృతులకు నివాళులర్పిస్తూ కొత్తగూడెం ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటి ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే స్టేషన్ సెంటర్లో మానవాహారం నిర్మించి మృతులకు నివాళులర్పించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జమ్ము-కాశ్మీర్ భారత భూభాగంలో అంతర్భాగమేనని, ఎప్పటికీ దేశం నుంచి వేరుచేయలేరన్నారు. కాశ్మీర్ సమస్యను ఆసరాగా చేసుకుని పాక్ ఉగ్రవాదులు అమాయక ప్రజలపై దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతా రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, ఉర్దూఘర్ చైర్మన్ నయీమ్ ఖురేషి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, జేఏసీ నాయకులు ఉమర్ ఫరూక్, అబ్దుల్ రబ్, ఎండి షరీఫ్, ఎండి అబిద్, అమీర్ ఖాద్రి, జావేద్, ఎండి అయూబ్, అన్వర్, బాబు జానీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ