Thursday, 17 September 2026 10:41:08 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

త్వరలో భద్రాద్రి కొత్తగూడెంకు సీఎం రాక, మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభోత్సవానికి రండి• సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ఆహ్వానం •

Date : 18 November 2025 08:14 PM Views : 501

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : •కొత్తగూడెం లో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభోత్సవానికి రండి• సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ఆహ్వానం •డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు•పకడ్బందీ ఏర్పాట్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు అధికారికంగా ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఖచ్చితంగా జిల్లా పర్యటనకు వస్తానని పేర్కొన్నారు.డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు.మంత్రి తుమ్మల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ స్పందిస్తూ డిసెంబర్ 1 నుండి 8 వరకు ఏ తేదీనైనా కార్యక్రమాన్ని చేపట్టొచ్చు. అనుకూలమైన రోజు నిర్ణయించుకుని తెలియజేస్తానని సూచించారు.దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైంది. ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని ఆదేశంసీఎం రానున్న విషయం ఖరారైన వెంటనే మంత్రి తుమ్మల, విద్య శాఖ సెక్రటరీ శ్రీధర్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు, సంబంధిత శాఖలకు తక్షణమే కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమ వేదిక, స్టేజ్, లేఅవుట్ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్డు, వసతులు, పార్కింగ్, రాకపోకలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని,భద్రత విషయాల్లో లోపాలు లేకుండా పోలీసు శాఖతో సమన్వయంతో పని చేయాలన్నారు. అతిథుల నిర్వహణ, వసతి, మీడియా సెంటర్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచించారు. విశ్వవిద్యాలయ భవనాలు, ల్యాబ్‌లు, మౌలిక వసతుల పరిశీలనకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.దేశానికే ప్రత్యేక గుర్తింపునిచ్చే వర్సిటీ కొత్తగూడెం మైనింగ్ విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా మారనుందని మంత్రి తుమ్మల తెలిపారు.300 ఎకరాల్లో నిర్మించిన ఈ వర్సిటీ, ఇప్పటికే ఆధ్యునిక ల్యాబ్‌లు, పరిశోధన కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యా వసతులతో నిర్మించారు.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ విద్యా రంగం జాతీయస్థాయిలో కొత్త గుర్తింపు పొందనుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.మంత్రి తుమ్మల కృషితోనే సాధ్యమైన ప్రాజెక్ట్,మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేయడం, దానికి భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ పేరును నిర్ణయించడం మంత్రి తుమ్మల నిరంతర కృషి వల్లే సాధ్యమయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జిల్లా అభివృద్ధికి తనదైన శైలిలో పని చేస్తున్న తుమ్మల కృషికి ప్రజలు, విద్యారంగ నిపుణులు అభినందనలు తెలియజేస్తున్నారు.యువతకు ఉపాధి – జిల్లాకు అభివృద్ధి,వర్సిటీ ప్రారంభోత్సవం నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు,యువతకు పరిశోధనా, ఉపాధి అవకాశాలు,కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పరిశోధన సంస్థలు రావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. జిల్లాలో విద్య–పరిశ్రమల సమన్వయంతో ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :