Thursday, 17 September 2026 11:50:23 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎకనామిక్ నేషనల్ కోఆర్డినేటర్‌గా విఠల్ నియామకం

Date : 01 September 2026 05:35 PM Views : 317

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆర్థిక అహింస, శాంతియుత ఆర్థికాభివృద్ధి సేవల కోసం గుర్తింపు ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ (నేషనల్ కౌన్సిల్ గా కొత్తగూడెం పట్టణానికి చెందిన విఠల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ డా. సౌరవ్ అగర్వాల్ 24 ఆగస్టు 2026న నియామక పత్రాన్ని జారీ చేశారు. ఎకానమిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక బహుముఖ, లాభాపేక్షలేని, , స్వతంత్ర సంస్థ అని విఠల్ పేర్కొన్నారు ఆర్థిక సోదరభావం ఆర్థిక అహింసను ప్రోత్సహించేందుకు పనిచేస్తుందని, దానికి కట్టుబడి పని చేయాలని విఠల్ పేర్కొన్నారు. ఆర్థిక, ప్రజా విధానాలు, వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ, విధాన చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ప్రభుత్వ సంబంధాలు తదితర రంగాల్లో నిపుణుల బృందంతో సంస్థ పనిచేస్తున్నట్లు వివరించారు. విటల్ నీ గౌరవ ప్రాతిపదికన ప్రారంభంగా ఒక సంవత్సరం కాలానికి, తక్షణ ప్రభావంతో లేదా తదుపరి నిర్ణయం తీసుకునే వరకు నేషనల్ కోఆర్డినేటర్‌గా ఆహ్వానిస్తున్నట్లు ఎకానమిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా శాంతియుత ఆర్థికాభివృద్ధి, సహజీవనం, సహనం, ఆర్థిక అహింస వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడంలో విటల్ మార్గదర్శకత్వం, సూచనలు, సహకారం అందిస్తారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, బహుళపాక్షిక సంస్థలు, వివిధ సంస్థలు, పౌర సమాజ సంస్థలు, వ్యక్తులతో ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున సమన్వయం చేస్తూ సంస్థ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతల్లో భాగస్వామ్యం కావాలని డాక్టర్ సౌరవ్ శర్మ పేర్కొన్నారు.ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరును దుర్వినియోగం చేయకుండా, తప్పుడు ప్రాతినిధ్యం వహించకుండా, ఎలాంటి ఆర్థిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో సంస్థను భాగస్వామ్యం చేయకుండా న్యాయబద్ధమైన ప్రవర్తనను పాటిస్తానని విటల్ పేర్కొన్నారు.విటల్ నియామకంపై పలు ప్రజా సంఘాలు, ఆర్థిక నిపుణులు పలువురు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, కార్పొరేట్, సామాజిక సంస్థలతో సమన్వయం చేస్తూ ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లక్ష్యాల సాధనలో ఆయన కీలక పాత్ర పోషించాలని వారు కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :