తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు ఈసారి మూడు నెలలకు సంబంధించి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రుక్మిణీ దేవి తెలిపారు. జిల్లాలో ఆదివారం బియ్యం పం పిణీ మొదలుకాగా, ఆమె పలు రేషన్ షాపు ల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీఎస్ఓ మాట్లాడుతూ కార్డుదారులకు అవసరమైన 17287 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ను MLS పాయింట్ నుండి చౌకధరల ధూఖనములకు ధఫల వారీగా తరలించుచున్నారని తెలిపారు. ఈనెలలో 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ ఉంటుందని, డీలర్లు సమయ పాలన పాటించాలని సూచించారు. జిల్లాలోని 443 రేషన్ షాపులలో నేటి వరకు 32,488 మంది కార్డుదారులు బియ్యం తీసుకు న్నారని డీసీఎస్ఓ రుక్మిణీ దేవి తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ