తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం MRO D. పుల్లయ్య కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేశారని, ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణ విమోచన కోసం కృషి చేశారని తెలిపారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా సెప్టెంబర్ 17వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ విమోచన దినోత్సవం”గా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొత్తగూడెం పట్టణ కేంద్రంలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని MRO కి అందజేసిన వినతి పత్రంలో కోరారు. చరిత్రను వక్రీకరించకుండా, తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శీలం విద్యాసాగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్, ఆదిముల రాములు, కనుకుంట్ల రాజమొగిలి, కొత్తూరు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు అలంకార్ రాజశేఖర్, చంద్రగిరి రమేష్, పట్టణ నాయకులు భాస్కర్ గౌడ్, గిరి, హృదయ్, రాజేష్, లలిత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ