తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 5 (తెలుగు వెలుగు) జూలూరుపాడు ఉన్నత పాఠశాల యందు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని పాఠశాల యందు గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ రాధాకృష్ణన్ తన బాల్యంలో చాలా పేదరికం నుంచి కష్టపడి చదివి ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించుట జరిగిందన్నారు. వారు అధ్యాపకులుగా మొదలుపెట్టిన ప్రస్థానం దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని నిర్వహించుట జరిగినది ఆ పదవికి వన్నెతెచ్చిన వ్యక్తిగా పేరు గడించారు. వారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకొనుట చాలా సంతోషంగా ఉందని ఉన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొనటం జరిగినది. మరియు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామానికి చెందిన విశ్రాంత మండల విద్యాధికారి డాక్టర్ మద్దిశెట్టి వెంకటేశ్వరావును ఘనంగా సన్మానించిన సామాజికవేత్తలు సింగరేణి అండర్ మేనేజర్ ఆరేమ్ రామయ్య, పుర ప్రముఖులు రోకటి రంగారావు, సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వేల్పుల నరసింహారావు, పోతురాజు నాగరాజు నాగరాజు, రోకటి నరసింహారావు, మరియు పాత్రికేయులు మోదుగు ఆదాం పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ