తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? భద్రాద్రి జిల్లా నుంచి 500 మంది తరలింపు ???? నెల రోజుల ప్రచారానికి భారీ స్పందన ???? హక్కుల సాధనకు పోరాటాలు తప్పవు ???? ఢిల్లీ వేదికగా ఉద్యమ కార్యాచరణ : సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా దేశంలో మార్పు కోసమే ఢిల్లీ వేదికగా భారీ పోరాట యాత్ర, బహిరంగసభ జరుగుతోందని, ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 500 మంది కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు తరలివెళ్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తెలిపారు. జిల్లా నుంచి ఢిల్లీకి తరలివెళుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజులుగా జిల్లాలోని గ్రామాలు, బస్తీలలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ నెల 6 నుంచి 14 వరకు నిర్వహించిన జన చైతన్య యాత్రలతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రైతాంగం, కార్మిక వర్గం, విద్యార్థులు, మహిళలు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీలో జరిగే పోరాటంలో జిల్లా ప్రతినిధులు క్రియాశీలకంగా పాల్గొంటారని, అక్కడ తీసుకునే నిర్ణయాల అమలుకు భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, ఉప్పుశెట్టి రాహుల్, కంచర్ల జమలయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, డి సుధాకర్, రాజబాబు, సర్పంచులు, కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ