Thursday, 17 September 2026 08:15:41 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు రద్దు చేయాలి

Date : 22 November 2024 05:46 PM Views : 643

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ 26న జరుగుతున్న కలెక్టరేట్ ఎదుట ధర్నా ను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గతంలో రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను, కార్మికుల హక్కులను హరించే విధంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26న జరుగుతున్న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని అఖిలపక్ష రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర పాలకుల కార్పోరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కోని నష్టపోతున్నారని ఆరోపించారు.రైతులు పండిస్తున్న అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిపార్సులు మేరకు మద్దతు ధర వ్యవసాయ ఖర్చుకు 50 శాతం అదనంగా జోడించి అమలు చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నామోడీ ప్రభుత్వం నిమ్మక నేరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2024 ,2025 సంవత్సరానికి 5 .35 శాతం పెంచి వరి క్వింటాకు 2300 మద్దతు ధరలను నిర్ణయించిందని, రైతుల డిమాండ్ ప్రకారం పంటల పెట్టుబడి ఖర్చు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను పెంచడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చేముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారం వచ్చిన తర్వాత రైతులందరికీ రుణమాఫీ చేయలేదని, రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఝటిస్తూ నవంబర్ 26 న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్ కే యం , కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, దేశ వ్యాప్త ఆందోళనలో రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వామ్యం కావాలని కోరారు . ఈ మావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ ధర్మ, సిఐటియు జిల్లా నాయకులు యీసా నరేష్, అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు వల్లోజి రమేష్, టి యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎదలాపురం గోపాలరావు,తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి గడిదేశి కనకరత్నం, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా, నాయకులు ఎల్లంకి మధు, వల్లమల సామెల్, కల్తి నరసరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :