తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం.. మంగళవారము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధి , చిట్టి రామవరం తండా అంగన్వాడి, 1,2. కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు లో భాగంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీడీపీఓ పద్మశ్రీ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని జీవితాంతం బిడ్డను పలు వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయని చెప్పారు. మనదేశంలో పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు తాగుతున్న పసికందులు కేవలం 4 శాతం మాత్రమేనని ఇదే పురుగున్న బంగ్లాదేశ్లో 92 శాతం అని గుర్తు చేశారు. ప్రపంచంలో తల్లిపాలుకు ప్రత్యామ్నాయం లేదని తల్లిపాలు అత్యంత విశిష్టమైనవన్నారు. బిడ్డకు తల్లిపాలు పడితే అటు బిడ్డ, ఇటు తల్లి, అనేక వ్యాధుల నుంచి విముక్తులవుతారని చెప్పారు, బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి నుంచి వచ్చే మురుపాలు అమృతంతో సమానమని, బిడ్డను భవిష్యత్తులో షుగర్, అధిక బరువు, ఆస్తమా, వంటి రోగాల నుంచి కాపాడుతాయి అని చెప్పారు. తల్లిపాలు బిడ్డ ఎంత ఎక్కువ కాలం తాగితే అంత బాగా తెలివితేటలు వృద్ధి చెందుతాయని వివరించారు, తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీడీపీఓ పద్మశ్రీ స్థానిక , అంగన్వాడి సూపర్వైజర్ పార్వతి, డాక్టర్స్ అజయ్,GNM వర కుమారి, అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి, తులసి బాయ్, హెల్పర్లు మీనా, భవాని, తల్లి పిల్లలు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ