తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేట్ ఏరియాలో అన్వేషణ విభాగంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జనరల్ మేనేజర్ కే.పంకజ్ మరియు హెచ్ ఓ డి (డిజిఎం) వీర్రాజు ను కార్పొరేట్ ఎఐటియుసి బ్రాంచ్ కమిటీ, ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి మాట్లాడుతూ, అన్వేషణ విభాగ కార్మికుల పదోన్నతి విధానాన్ని మరింత మెరుగుపరచాలని, డ్రిల్లింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయాలని, పాత డ్రిల్లింగ్ యంత్రాల స్థానంలో ఆధునిక యంత్రాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే అన్వేషణ విభాగ వర్క్‌షాప్‌కు అత్యాధునిక యంత్ర సామగ్రిని సమకూర్చి శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా అన్వేషణ విభాగంలో నెలకొన్న పలు కార్మిక, పరిపాలనా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్మికుల సంక్షేమం, శాఖ అభివృద్ధి పరస్పరం ముడిపడి ఉన్న అంశాలని, ఈ దిశగా యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి, సహాయ కార్యదర్శి సామల రాము, ఉపాధ్యక్షుడు కె.డబ్ల్యూ. క్రిస్టఫర్, పిట్ కార్యదర్శి బండి సదానందం, పిట్ సహాయ కార్యదర్శి తుమ్మ రవికుమార్, దావా వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శంకర్,ఉమామహేశ్వరరావు,పుల్లాచారి,నవ్య, అనూష,తిరుమలరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ