తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన ఆదివారం అసుబాక, తిరుమలకుంట, రెడ్డిగూడెం, వినాయకాపురం గ్రామపంచాయతీల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు కల్పించిన వసతులు, పోలింగ్ సిబ్బంది నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అర్హుడైన ఓటరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు భద్రతతో తరలించాలని అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ