తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు: మండల పరిధిలోని మాచినేనిపేట తండా అంగన్వాడి కేంద్రంలో మంగళవారం కిశోర బాలికలకు సిడిపిఓ సలోమి చిరుధాన్యాల చిక్కి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 14 నుండి 17 సంవత్సరాల కిశోర బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ బాల్య వివాహాల వలన కలిగే నష్టాల గురించి వివరించి వారికి అవగాహన కల్పించారు. అదే విధంగా మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ లక్ష్మీ, అంగన్వాడి టీచర్ భూక్య లలిత, స్రవంతి, హెల్పర్ బుజ్జి, కిశోర బాలికలు, తల్లులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ