Saturday, 18 April 2026 06:27:25 PM
# ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

తరగతి గది నుంచి బయట ప్రపంచాన్ని చూడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 05 February 2026 11:20 AM Views : 59

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తరగతి గదిలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, బయట ప్రపంచంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలు ఆలోచించే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయడం ద్వారా తమ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావాలంటే ఉపాధ్యాయుల ప్రోత్సాహం కీలకమని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు మూడు రోజులపాటు నిర్వహించనున్న “ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్” బూట్ క్యాంప్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు చూపేలా ప్రాజెక్టులు రూపొందించేందుకు ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అలాంటి ప్రాజెక్టులను ఉత్పత్తుల రూపంలోకి తీసుకువచ్చే దిశగా విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ బూట్ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బూట్ క్యాంప్ ద్వారా ఉపాధ్యాయులు పొందిన జ్ఞానం, అనుభవాలను తరగతి గదిలో విద్యార్థులకు అందించి, వారి సృజనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు రూపొందించిన నవకల్పనలను ఉత్పత్తులుగా అభివృద్ధి చేయడంలో వాద్వానీ ఫౌండేషన్, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పీఎం శ్రీ పాఠశాలలు భాగస్వాములుగా వ్యవహరించి విద్యార్థులను ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నుండి విభం వ్యాస్, వాద్వానీ ఫౌండేషన్ నుండి శ్యామ్, డాక్టర్ హెచ్. శ్రీనివాస్ వరప్రసాద్, అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ భరత్ కృష్ణ, ప్రిన్సిపాల్ రవికుమార్, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుండి పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :