Wednesday, 16 September 2026 09:48:32 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

శాశ్వత వ్యవసాయ మార్కెట్ కోసం పది ఎకరాల విస్తీర్ణంలో 3.30 కోట్లనిధులు మంజూరు, రైతులు, రైతు కూలీలు సంబరాలు .

Date : 12 September 2025 09:35 PM Views : 596

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ లో సరైన వసతులు లేక రైతులు, హమాలీలు, బయ్యర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు గతంలో హమాలీలు రైతులు శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కృషి, పట్టుదల ఫలితంగా జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 3.30 కోట్ల నిధులు మంజూరు చేయబడినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ పి.రవికుమార్ తెలిపారు.ఈ నిధుల కేటాయింపుతో జూలూరుపాడులోని 10 ఎకరాల స్థలంలో శాశ్వత మార్కెట్ నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే స్థలాన్ని పరిశీలించి, భూమి చదును, చెట్ల తొలగింపు పనులతో పాటు ఒక షెడ్డు, రెండు క్యాబిన్ల నిర్మాణం చేపట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.ఈ ఏడాదిలోనే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రైతులు, రైతు కూలీలు, హమాలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించబడతాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ , రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే నా మొదటి లక్ష్యం. జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం కోసం నేను ప్రభుత్వం వద్ద పట్టుబట్టి కృషి చేశాను. ఇది రైతులకు, వ్యాపారులకు, హమాలీలకు చాలా ఉపయుక్తంగా ఉండబోతోంది. ఈ మార్కెట్‌తో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుంద అని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :