Tuesday, 03 November 2026 09:33:04 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ఎన్నికల వ్యయాల పర్యవేక్షణలో భాగంగా పెంట్లం, చంద్రుగొండ మండలాల్లో పర్యటించిన ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య

Date : 08 December 2025 06:59 PM Views : 188

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా— గ్రాంపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల వ్యయాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి నియమితులైన ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య సోమవారం పెంట్లం ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె ఎస్‌.ఎస్‌.టీ., ఎఫ్‌.ఎస్‌.టీ. బృందాలు చురుకుగా పనిచేయాలని, అక్రమ రవాణా, నగదు పంపిణీ, విలువైన వస్తువుల తరలింపులను కట్టడి చేసి, ప్రతీ తనిఖీని తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే ఏ చర్యలనైనా తక్షణమే నివేదించాలని ఆమె స్పష్టం చేశారు. అనంతరం చంద్రుగొండ మండల కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని, పోటీ అభ్యర్థులు మరియు ఎన్నికల సంబంధిత బృందాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ మాట్లాడుతూ, ఎన్నికల వ్యయాల పట్ల పూర్తి పారదర్శకత పాటించాలని, ఖర్చుల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయాల పత్రాలను విధి విధానాలకు అనుగుణంగా నిర్వహించి, నిర్దిష్ట సమయానికి సమర్పించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో జిల్లా వ్యయ నోడల్ అధికారి, మండల ప్రత్యేక బృందాలు, పరిశీలన అధికారులు, పోటీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :