తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి యోగా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ తరగతులలో కొత్తగూడెం సబ్ డివిజన్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది,ఆర్మడ్ రిజర్వు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.నిత్యం విధులలో నిమగ్నమై ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ శాఖలోని అధికారులు మరియు సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు,మానసికంగా కూడా దృఢంగా ఉండే విధంగా చేయడంలో భాగంగానే ఇకపై ప్రతి శుక్రవారం యోగా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో వెల్లడించారు.యోగా,ధ్యానం వంటిని అలవాటుగా చేసుకుని నిత్యం సాధన చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు దైనందిన కార్యక్రమాలలో ఉత్సాహంగా,చురుకుగా పాల్గొనవచ్చని అన్నారు.కావున పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ తరగతుల ఆవశ్యకత తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్,రమేష్,శివప్రసాద్,ఆర్ఐలు లాల్ బాబు,సుధాకర్,నరసింహారావు,కృష్ణారావు మరియు సిబ్బంది హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ