తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ మురళి తెలిపిన వివరాలిలా.. ముదిగొండ మండలం గోకినేపల్లి జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం అదుపుతప్పి ఓ కార్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఖమ్మం నగరానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ