Monday, 02 November 2026 11:00:17 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

పదవ తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి ఒక మైలురాయి.. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 20 March 2025 12:40 PM Views : 958

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేపటినుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న ప్రతి విద్యార్థికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో ప్రాధాన్యతను గల పదవ తరగతి పరీక్షలు రేపటి నుండి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని కలెక్టర్ తెలిపారు. పది పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయి అని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో తదుపరి మీ ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధించగలరని ఆయన తెలిపారు. పరీక్షల్లో విజయానికి ప్రణాళిక బద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు మంచిగా స్పష్టంగా సమాధానాలు రాయాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లాలో 73 పరీక్ష కేం ద్రాలు ఏర్పాటు చేయగా 12,282 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 73 మం ది చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఏడుగురు రూట్ అధికారులు. 73 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 26 మంది సెంటర్ కస్టోడియన్లు, 73 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధానపత్రాల బండిళ్లను పోస్టా ఫీసులకు చేరవేసేందుకు పోలీసు బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద సిసి కెమెరాలు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మాల్ ప్రాక్టీస్ ను నిరోధించేందుకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి వేసే విధంగా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్ సర్వీస్ లు నడిపేలా ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాయాలని తద్వారా నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :