తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత నాలుగు దశాబ్దాలుగా మొక్కలను పెంచుతూ ఉచితంగా పెంచుతూ పర్యావరణానికి పాటుపడుతున్న మొక్కల వెంకటయ్య ఆదివారం రాత్రి హైదరాబాద్ నార్సింగ్ లోనీ ఓమ్ కన్వెన్షన్ హాల్లో "టాప్ హండ్రెడ్ సోషల్ హీరో" అవార్డును అందుకున్నారు నిర్వి ఆర్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ 100 మంది సోషల్ హీరోలను ఎంపిక చేసింది. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఈ అవార్డును వెంకటయ్య కు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు వెంకటయ్య ప్రకృతి సేవలను కొనియాడారు. అవార్డును అందజేసిన వారిలో నిర్వి ఆర్ట్స్ చైర్మన్ హెచ్ శివప్రసాద్ రెడ్డి, హైకోర్టు జడ్జి రామకృష్ణారెడ్డి, ఐపీఎస్ అధికారి ప్రమోద్ కుమార్, పద్మ (దక్కన్ కెమికల్ చైర్మన్), క్రాంతి(వసుధ ఫౌండేషన్), శ్వేత( ఫ్రెండ్లీ వెల్ఫేర్ అసోసియేషన్), బిజెపి ఎంపీ లక్ష్మ ణ్, మొదలగు ప్రముఖుల చేతుల మీదుగా వెంకటయ్య కు అవార్డు, రివార్డులను అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ