తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల అటవీ రేంజ్ గుండెపుడి బీట్ పరిధిలో జామాయిల్ ప్లాంటేషన్లో అక్రమంగా కలపను దొంగిలించారని కథనాలపై స్పందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి క్రిష్టా గౌడ్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం డి ఆర్ ఓ సలూజ ఆధ్వర్యంలో జూలూరుపాడు రేంజ్ గుండెపుడి బీట్ ను అకస్మికంగా తనకి చేశారు. డి ఆర్ ఓ సలూజ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నరకబడిన జామాయిల్ చెట్లను కొలతలు తీసుకుని ప్లాంటేషన్ లో ఏ మేరకు చెట్లు నరకబడినవి అని ఏ మేరకు నష్టం జరిగింది అని చూసి జిల్లా పై అధికారులకు నివేదికను అందిస్తామని చెప్పారు. ఈ తనిఖీలలో డిఆర్ఓ సలూజ తో పాటు భద్రాద్రి జిల్లా టాస్క్ ఫోర్స్ ఎఫ్ ఎస్ ఓ లోకనాథం, ఎఫ్ ఎస్ ఓ ప్రసాద్ రావు, బీట్ ఆఫీసర్ రాఘవరావు, బి రాములు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ