Thursday, 17 September 2026 04:44:10 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఉద్యమకారుల చైతన్య యాత్రకు ఘనస్వాగతం పలికిన జిల్లాTUF ఏప్రిల్ 21 ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ

Date : 14 April 2025 07:28 PM Views : 617

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టి.యు.ఎఫ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉద్యమకారుల చైతన్య యాత్ర ఆదివారం రాత్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పోస్టాఫీసు సెంటర్ నందు టి.యు.ఎఫ్. కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యండి.మంజూర్ ఆధ్వర్యంలో యాత్రా బృందానికి ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చైతన్య యాత్ర బృందానికి పూలదండలు, శాలువాలతో సత్కరించి ఆహ్వానించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టి.యు.ఎఫ్. రాష్ట్ర చైర్మన్ డా" చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి త్యాగాలు చేసింది ఉద్యమకారులు ఐతే భోగాలు ఉద్యమం ద్రోహులు అనుభవిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యమకారులకు 250 చ"గ ల స్థలంతో పాటు నిర్మాణానికి 5 లక్షలు, మరియు 25000/- పెన్షన్ ఇస్తామని ఆరు గ్యారంటీల మ్యానిఫెస్టోలో ప్రకటించి 2 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం దాని ఊసే లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలని లేకుంటే మరో‌ఉద్యమానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఉద్యమకారులను గుర్తించి వారికి నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని, ప్రభుత్వ పథకాలలో ఉద్యమకారులకు ప్రాదాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 21 తేదీన హైదరాబాద్ సితాఫల్ మండీలో ప్లీనరీకి ఉద్యమకారులు వేల సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి,TUF యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ యండి.మసూద్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు సింధూ తపస్వి, తెలంగాణ SC.ST.BC.మైనారిటి విద్యార్థి,యువజన విభాగం అధ్యక్షుడు కోటా శివశంకర్, 69 ఉద్యమకారుల సంఘం నాయకులు మ్యాథ్యూస్,హరగోపాల్,యాదగిరి,యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నవతన్, కొండ జంపన్న,జాన్ విక్టోరియా, జిల్లా కార్యదర్శి ఇజ్జగాని రవి గౌడ్, అడ్వకేట్ సాదిక్ పాషా,అఖిల్ మహర్షి,ఆదిల్,హసీబ్,మౌలాన,మోహన్ రావు, నాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :