తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ( ) ఆలయాలలో నిర్వహించే అన్నదానం మహా ప్రసాదం లాంటిదని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. విజయ విఘ్నేశ్వర దేవాలయం కమిటీ సభ్యులు ప్రతి బుదవారం చేస్తున్న అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మాట్లాడుతూ మానవ జన్మ మహా గొప్పదని, అందులో భక్తి మార్గం చాలా గొప్పది ,మన సంపాదనలో కొంతైనా భక్తి మార్గం అన్న ప్రసాదం లాంటి కార్యక్రమాలు చేయాలన్నారు. భగవంతుడికి నచ్చేది ఒకటేనని పేదలకు అన్నదానం, వస్త్ర దానం ఎంతో అవసరం మనకు తోచిన విధంగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లపోతు వాసు, అనూప్ ఖండేల్ వాల్, సంకా శ్రీనివాసరావు, రాము, జయప్రకాష్, బొబ్బాల వెంకట్ యాదవ్, లింగయ్య, గణేష్, నాగేశ్వరావు, శ్రీనివాసరావు, సాయిచంద్ మరియు విజయ విగ్నేశ్వర దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ