Sunday, 02 August 2026 02:53:11 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సామాజిక సమానత్వానికి మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 11 April 2026 03:33 PM Views : 145

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సామాజిక సమానత్వం, విద్యా వ్యాప్తి కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు . శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పడంలో జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ముందుగా తన భార్యకు విద్య అందించి, మహిళల సాధికారతకు పునాది వేసిన మహనీయుడు పూలే అని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, వారికి సామాజిక న్యాయం అందించేందుకు కొత్త దారులు చూపిన గొప్ప సంస్కర్తగా ఆయన నిలిచారని తెలిపారు. జాతి, వర్ణ వివక్షలను వ్యతిరేకిస్తూ సమాన హక్కుల సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేసిన పూలే ఆలోచనలు ఈనాటికీ ఎంతో ప్రాసంగికమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి దినేష్ ఎ.డి. మైన్స్, ఉపేందర్ ఇ.డి ఎస్.సి. కార్పోరేషన్, జి. శ్రీనివాస్ జిల్లా ఆడిట్ అధికారి డ సుదీర్ కుమార్ పంచాయితీరాజ్ శాఖ,జిల్లా అధికారులు, బి సి సంఘ నాయకులు కొదుమూరు సత్యనారణ బొర్రా జయమ్మ గుమలాపురం సత్యనారణ జి. కృష్ణ గారు, ఇంద్రాల మురళి, వారాధి సత్యనారాయణ , బండి రాజుగౌడ్, కార్యాలయ సిబ్బంది తదితరులు కార్యాక్రమంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :