Thursday, 17 September 2026 08:22:34 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 11 November 2025 08:32 PM Views : 376

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునీకరణ చర్యలు అత్యవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు అవసరమైన ఆధునీకరణ చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం, వైద్య పరికరాల అవసరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆపరేషన్ థియేటర్ విభాగాన్ని పరిశీలించి, ఆధునీకరణ కోసం అవసరమైన అత్యాధునిక పరికరాలు, సాంకేతిక వినియోగం, ప్రస్తుత సదుపాయాల బలోపేతం వంటి అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బందితో చర్చించారు.ఆసుపత్రి భవనం పైభాగంలో నీటి లీకేజ్ సమస్యను గమనించిన కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను పిలిచి వెంటనే లీకేజీ నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన ప్రసూతి విభాగం, శిశు సంరక్షణ విభాగం, అత్యవసర వైద్య విభాగం, వార్డులను సందర్శించి పరిశుభ్రత, వైద్య సదుపాయాలు, రోగుల సేవా ప్రమాణాలను పరిశీలించారు. అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలెక్టర్ మాట్లాడుతూ —“ఆసుపత్రి ఆవరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రతలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. పరిశుభ్ర వాతావరణంలోనే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది,” అని సూచించారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా యూనిఫార్మ్‌లు ధరించాలని, అవసరమైతే వారందరికీ యూనిఫార్మ్‌లు అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బంది నర్సుల కొరతను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రి (GGH) నుండి తాత్కాలికంగా నర్సులను నియమించడానికి అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇటీవల సిఎంఆర్ (CMR) బృందం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అందిస్తున్న సేవలను ప్రశంసించిందని, ఈ విజయానికి కృషి చేసిన వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందిని కలెక్టర్ అభినందించి సన్మానించారు.జిల్లా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి ఆదర్శంగా నిలవాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఆధునీకరణ దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఓ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆరోగ్య విభాగాధికారులు, మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :