Wednesday, 04 November 2026 03:45:40 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

బిజెపి జిల్లా మహిళా మోర్చా కమిటీ నియామకం. బిజెపి అనుబంద మహిళా కమిటీని ప్రకటించిన జిల్లా అధ్యక్షులు" బైరెడ్డి"

Date : 20 August 2026 07:50 PM Views : 331

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బిజెపి జిల్లా మహిళా మోర్చా కమిటీ నియామకం. జిల్లా అధ్యక్షురాలుగా సముద్రాల గాయత్రి. 26 మంది సభ్యులతో కూడిన జిల్లా కమిటీ నియామకం.బిజెపి అనుబంద మహిళా కమిటీని ప్రకటించిన జిల్లా అధ్యక్షులు" బైరెడ్డి" భారతీయ జనతా పార్టీ అనుబంధ జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీని పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా కమిటీకి పూర్తిస్థాయి 26 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించడం జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా సముద్రాల గాయత్రిని నియమిస్తూ జిల్లా పార్టీ అధ్యక్షులు అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా అధ్యక్షురాలు సముద్రాలు గాయత్రి ఆధ్వర్యంలో 26 మంది సభ్యులతో కూడిన జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. కమిటీలో ఉపాధ్యక్షులుగా కేతిని సావిత్రి, బానోత్ గంగ, అట్రం మమత, గరిక లక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా జల్ల స్వప్న, మువ్వ అపర్ణలను నియమించారు. అదేవిధంగా కార్యదర్శులుగా ధారావత్ పార్వతి, అడప వెంకట మణి, బట్టు సంధ్య, ఉయిక తులసిలను నియమించారు. కోశాధికారిగా భీమల్ సునీత, ఆఫీస్ సెక్రటరీలుగా భుఖ్య ఆశ, కొల్లె అనిత, సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పల్లపు శిరీష, మంకీ బాత్ కన్వీనర్‌గా బండారి రాజేశ్వరి, ఐటీ కన్వీనర్‌గా పోలే మనస్విని, స్పోక్స్ పర్సన్‌గా భోగ లక్ష్మిలను ఎంపిక చేశారు. అలాగే తాండ్ర కుసుమ భవాని, ఏసు మని, ధారావత్ భారతి, ధారావత్ విష్ణు ప్రియ, పుట్ట వెంకటరమణ, పర్సగాని నాగమణి, పర్సగాని శ్రావణి, రావుల పద్మ, పుట్టి సుజాతలను కార్యవర్గ సభ్యులుగా నియమించారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి మాట్లాడుతూ మహిళా మోర్చా నూతన కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తిని మరింత బలోపేతం చేస్తూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ప్రత్యేకించి 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వివక్షతకు వ్యతిరేకంగా బిజెపి మహిళ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి పార్టీలో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించడం హర్షణీయమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :