తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం. రామచంద్రరావు ని అక్రమంగా గృహనిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ, బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం మరియు రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు, అల్లరి మూకలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకులపై అక్రమ గృహనిర్బంధాలు చేయడం, రాజకీయ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం సరికాదని అన్నారు. ఇలాంటి చర్యలకు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదని అన్నారు.“బీజేపీకి సంస్కారం ఉంది కాబట్టి విమర్శలకు హద్దులు దాటకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు” అని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రుల పనితీరుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి డా. జాటోత్ వెంకన్న నాయక్, నాలుగో డివిజన్ కార్పొరేటర్ మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్ష్మి , చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు నవీన్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు జుజ్జూరు మోహన్ కృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి , ఎస్సీ మోర్చా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి స్వప్న, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బడే రమేష్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు వీర ప్రతాప్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సంగి చంటి రాజు , యువర్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు మహంకాళి శంకర్ చుంచుపల్లి మండల కార్యదర్శి బుర్ర సతీష్, రతన్ లాల్ పాసి , యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల వంశీ, ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సుధాకర్, సీనియర్ బీజేపీ నాయకులు చిన్న, రేఖ రాజశేఖర్, మురళి, యువ మోర్చా కార్యదర్శి ధారావత్ నరేష్ తదితర బీజేపీ నాయకులు, మోర్చాల ప్రతినిధులు, కార్యకర్తలు మరియు బీజేపీ అభిమానులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ