Thursday, 17 September 2026 09:35:47 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 22 January 2026 11:11 AM Views : 165

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు . బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంగ్లిష్ ఫైనల్ ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ మరియు వొకేషనల్ కోర్సుల ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 21, 2026న (9,278 మంది), సెకండ్ ఇయర్ విద్యార్థులకు జనవరి 22, 2026న (9,413 మంది) నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలు జనవరి 23, 2026న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జనవరి 24, 2026న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా, ఇంటర్మీడియట్ జనరల్ మరియు వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 20, 2026 వరకు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 37 థియరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఫస్ట్ ఇయర్‌కు 9,278 మంది, సెకండ్ ఇయర్‌కు 9,407 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 550 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 14 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు నియమించనున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల భద్రతకు పోలీస్ శాఖ సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు చెపట్టాలి అని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్, శుభ్రత, వైద్య సదుపాయాలు తదితర అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ముందుగానే సిద్ధం చేసుకుని, నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. అదేవిధంగా, పరీక్షలు నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా విద్యాశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ తదితర అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరావు, టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ అరవింద్ బాబు, డిప్యూటీ డిఎంహెచ్వో ప్రసాద్, పోలీస్ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :