తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ మరియు స్క్రూటినీ ప్రక్రియల పారదర్శక నిర్వహణను సమీక్షించేందుకు ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య ఆది వారం పలుమండలాల్లో పర్యటించారు.చంద్రుగొండ మండల పరిధిలోని రావికంపాడు, చంద్రుగొండ, దామరాచర్ల, గానుగపాడు గ్రామపంచాయతీలతో పాటు చూంచుపల్లి మండలం పరిధిలోని విద్యానగర్ కాలనీ, 3 క్లైన్, 4 క్లైన్ గ్రామపంచాయతీలలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ, ధృవీకరణ, దస్త్రాల పరిశీలన వంటి కార్యక్రమాలు ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతున్నాయా అనే అంశాలను ఆమె అధికారులు ద్వారా వివరంగా తెలుసుకున్నారు. అనంతరం, భూర్గంపహాడ్ మండలం పరిధిలోని మొరంపల్లి బంజార, భూర్గంపహాడ్, నాగినేని ప్రోలు గ్రామపంచాయతీలలో నిర్వహించిన స్క్రూటినీ ప్రక్రియను కూడా పరిశీలించి, ఎన్నికల సంబంధిత నిబంధనలు, షెడ్యూల్ ప్రకారం విధులు ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓలు, ఎంపీవోలు, ఎన్నికల బృంద సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ