తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం పోరాడిన మహాకవి, ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ కళాశాలలో పురస్కరించుకొని AISF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.కాళోజి నారాయణరావు గారు కేవలం కవి మాత్రమే కాదని, ప్రజల సమస్యలను తన రచనల ద్వారా ప్రశ్నించిన గొప్ప ప్రజా ఉద్యమకారుడని AISF అజిత్ అన్నారు . తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.“పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అనే కాళోజి భావజాలం యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉందన్నారు. అన్యాయం, అసమానతలు, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ప్రశ్నించే ధైర్యాన్ని కాళోజి సాహిత్యం అందిస్తుందని తెలిపారు.ప్రస్తుతం విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని AISF నాయకులు అజిత్ ప్రభుత్వం న్నీ డిమాండ్ చేశారు. కాళోజి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థి, యువతరం ప్రజా సమస్యలపై చైతన్యంతో ముందుకు రావాలని అజిత్ పిలుపునిచ్చారు.కాళోజి నారాయణరావు గారి సాహిత్యం, ఉద్యమ స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అజిత్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్, జిల్లా సమితి సభ్యులు జున్ను రాజ్ కమల్, నాయకులు నవ్య, హాసిని, సాత్విక, ప్రమీల, కళ్యాణి, వందన తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ