తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఛత్తీస్గఢ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 12 (తెలుగు వెలుగు): చత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. చత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బమార్క గ్రామంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఆదివాసీ మహిళ మృతి చెందింది. కవాసి సుక్కీ ఎప్పటిలానే తన పశువులను మేపడానికి అడవి మార్గంవైపు వెళ్లింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులను టార్గెట్ చేస్తూ అమర్చిన ఐఈడి పై కాలు వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో సుక్కీ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుంటుంబీకుల ఫిర్యాదు మేరకు కిష్టారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ