Saturday, 19 September 2026 01:34:34 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 10 June 2026 02:58 PM Views : 167

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం అన్నపురెడ్డిపల్లి మండలం అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులు మండలంలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిని గ్రామసభకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, మూడు దశాబ్దాల క్రితం గ్రామాల్లో సరైన రహదారులు, మరుగుదొడ్లు, మౌలిక వసతులు లేకపోయినా నేడు ప్రతి గ్రామంలో రహదారులు, తాగునీటి సదుపాయాలు, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. గ్రామీణాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యంతో మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు . ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ 6 నుండి ప్రారంభమైన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడి విధానాలను పాటిస్తూ వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను వినియోగించాలని కోరారు. గత సీజన్‌లో రైతులకు ఇబ్బందులు కలిగించిన పీఆర్-126 వరి రకాన్ని సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, పంటల వైవిధ్యీకరణ ద్వారా అధిక దిగుబడులు, ఆదాయం సాధించవచ్చని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, ఆయిల్ బాల్స్ వినియోగం, నిల్వ నీరు తొలగింపు వంటి చర్యలు చేపట్టి డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని, అర్హత కలిగిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి అర్హులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా ప్రీ-ప్రైమరీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిందని, అన్నపురెడ్డిపల్లి మండలానికి మూడు ప్రీ-ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు. పారదర్శకమైన ఓటరు జాబితా తయారీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇంటింటికి వచ్చే బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలు) సరైన వివరాలు అందించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామ సభకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ స్వర్ణ, ఎంపిడిఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబానా, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అనూష ఇతర మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :