తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్–2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది 3 స్వర్ణ, 7 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించి జిల్లా ప్రతిష్ఠను చాటారు.కొత్తగూడెం–I టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. కరుణాకర్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, ఫింగర్ ప్రింట్స్ విభాగాల్లో 2 స్వర్ణ పతకాలు, ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో రజత పతకం, ఆఫీస్ ఆటోమేషన్ విభాగంలో కాంస్య పతకం సాధించారు.ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్‌కే నాగుల్‌మీరా నార్కోటిక్ డాగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు.అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు రెడ్డి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో, ఇల్లందు ఎస్‌ఐ కె. ఉమా దర్యాప్తు ఆధారిత ఫోటోగ్రఫీ విభాగంలో, ఐటీ కోర్ పీసీ కె. నరేష్ ప్రోగ్రామింగ్ సామర్థ్య విభాగంలో, చెర్ల పీసీ ఎస్. అయ్యప్ప పోలీస్ ఫోటోగ్రఫీ విభాగంలో, ఏఆర్ పీసీ కె. మహేష్ ట్రాకర్ డాగ్ విభాగంలో రజత పతకాలు సాధించారు.బూర్గంపాడు డబ్ల్యూపీసీ బి. పావని పోలీస్ అబ్జర్వేషన్ విభాగంలో రజత పతకం, పోలీస్ పోర్ట్రెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పతక విజేతలను అభినందిస్తూ, భవిష్యత్తులో పోలీస్ డ్యూటీ మీట్ లలో ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ