Wednesday, 16 September 2026 07:38:22 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ ముని గడప పద్మ డిమాండ్.

Date : 08 August 2026 05:22 PM Views : 267

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. కొర్రీలతో, ప్రాముఖ్యత పేరుతో పెన్షన్లు మంజూరు చేస్తే ఉద్యమం తప్పదు.16వ డివిజన్ కార్పొరేటర్ ముని గడప పద్మ డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న విడుదల చేస్తామంటున్న సామాజిక పెన్షన్లను ఎలాంటి కొర్రీలు, ప్రాధాన్యత క్రమం కాకుండా అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం 16 వ డివిజన్ లో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మీడియాలో ఆగస్టు 15న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తారని వస్తున్న వార్తలు చూసి ప్రజలు సంతోషిస్తున్నారని, వారి సంతోషంపై నీళ్ళు చల్లద్దని, పెన్షన్ల మంజూరు చేస్తామని ఊరిస్తూ ప్రాధాన్యత క్రమం అంటూ అరకొర పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క డివిజన్లో 100 నుండి 150 కి పైగా అన్ని రకాల పెన్షన్ దారులు అర్హులుగా ఉన్నారని ఆమె అన్నారు. కేవలం డివిజన్ కొక 15 నుండి 20 పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నాన్ని విరమించుకోవాలని మరొక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె అన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయకపోతే ప్రజలందరినీ సమీకరించి ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఏర్పాటులో మొదటి సంతకమే వికలాంగులకు 6000 ల రూ..,ఇతరులకు 4000 ల రూ..ఇస్తామని నేటి కి పెంచిన పెన్షన్ ఇవ్వకపోవడం లబ్ధిదారులను మోసం చేసినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నూతన పెన్షన్ మంజూరు చేస్తారని ప్రజలు ఆశపడ్డారని కానీ వారి ఆశలపై నీళ్లు చెల్లి మల్ల ఆగస్టు 15న అని ప్రకటనలు రావటం ఇది నిజమేనా అని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. తక్షణమే ఆగస్టు 15న అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాలని, లేకుంటే ఉద్యమం తప్పదని ఆమె అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు మునిగడప వెంకటేశ్వర్లు నాయకులు కాంపల్లి దుర్గయ్య, కాంపెల్లి పుష్ప, కాండ్రేగుల సత్యవతి,దొంగ నాగమణి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :