తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ స్కార్ఫ్ డే సందర్భంగా ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ (ఎస్జీఎఫ్ ) ఆధ్వర్యంలో శనివారం భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవి పల్లిలో స్కార్ఫ్ డే నిర్వహించారు. ఎస్ జి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోగాన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో సేవా దృక్పథానికి ప్రతిబింబంగా నిలిచే స్కార్ఫ్ డే ఆవశ్యకత గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్స్ గిల్డ్ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ గిల్డ్ ప్రతినిధులు జ్యోతిరాణి, కళ్యాణి, అంజమ్మ, యశోద, కళావతి, కబ్స్, బుల్ బుల్స్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ