Friday, 18 September 2026 07:19:17 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

జిల్లాను రోల్ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 22 May 2026 06:06 PM Views : 127

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధికారుల – ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే ప్రజా పాలన విజయవంతం : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందాలి : పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి : ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షత వహించగా, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. కార్యక్రమం ప్రారంభ దశలో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, సంక్షేమ వారోత్సవాలు, ఆరోగ్య శిబిరాలు విస్తృత స్థాయిలో చేపట్టినట్లు తెలిపారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా నిరంతర పర్యవేక్షణతో పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అయితే ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయని అన్నారు . దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 65 డివిజన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గిరిజన జిల్లా అభివృద్ధిలో అన్ని శాఖల భాగస్వామ్యం అవసరమని, శాఖల సమన్వయంతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అనంతరం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :