Wednesday, 16 September 2026 05:11:16 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం : భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Date : 09 January 2026 08:05 PM Views : 224

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణకు రావలసిన ప్రతి నీటి బొట్టును కాపాడుకుంటాం.డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు పూర్తిచేస్తే ఈ ఏడాదిలోనే కొన్ని నియోజకవర్గాలకు సాగునీరు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణ నదుల నుంచి రావలసిన ప్రతి నీటి బొట్టును కాపాడుకుంటామని ఆయన అన్నారు.శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గండుగులపల్లి గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగవ పంప్ హౌస్ పనుల పురోగతిని, అలాగే మొత్తం ప్రాజెక్టు పనుల స్థితిగతులపై భారీ నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక వివరాలను మంత్రులకు వివరించారు.అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిపై స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించామని తెలిపారు. గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 968 టీఎంసీల నీటి వాటా కేటాయించబడిందని, నీటి లభ్యత 75 శాతం దాటిన తర్వాత సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని చెప్పారు. తాగునీటి అవసరాలను కూడా ప్రత్యేకంగా లెక్కగట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.గత ప్రభుత్వ హయాంలో పూర్తయ్యే అవకాశమున్న సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.19,324 కోట్ల వ్యయంతో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 6 లక్షల 74 వేల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించనున్నట్లు తెలిపారు. భూసేకరణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని వచ్చే ఆరు నెలల్లో భూసేకరణ కోసం రూ.5,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భూసేకరణ పూర్తయిన వెంటనే రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో గోదావరి, కృష్ణ నదులపై తెలంగాణకు రావలసిన నీటి వాటా పరిరక్షణ కోసం అన్ని స్థాయిల్లో సమర్థవంతమైన పోరాటం కొనసాగుతోందన్నారు. కృష్ణ వాటర్ ట్రిబ్యునల్, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సహా అన్ని వేదికలపై తెలంగాణకు రావలసిన ఒక్క చుక్క నీటినీ వదులుకోబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా పోలవరం–నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు నష్టం కలిగించే ఏ అంశాన్నీ అంగీకరించబోమని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత బోర్డులకు, సుప్రీంకోర్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను తెలియజేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు, రాష్ట్రానికి రావలసిన ప్రతి నీటి బొట్టును కాపాడుకునే వరకు ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ , మొదటి ప్రాధాన్యంగా పినపాక, కొత్తగూడెం, అశ్వరావుపేట, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు పూర్తిచేస్తే, ఈ ఏడాదిలోనే కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిన విధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణానికి సుమారు రూ.4,000 కోట్ల రివైజ్డ్ అంచనాలకు అనుమతి లభించడంతో, టెండర్లు, బిల్లుల ప్రక్రియలు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.గతంలో కేవలం మెయిన్ కెనాల్‌కే అనుమతులు ఉండటంతో డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు ప్రాజెక్టులో భాగంగా లేవని గుర్తు చేశారు. మంత్రుల స్థాయిలో నిరంతర ఒత్తిడి తీసుకురావడం వల్ల మొదటి మూడు పంప్ హౌసులు ప్రారంభానికి రావడంతో పాటు, 18 లింక్ కెనాళ్లు, రాజీవ్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకు నీళ్లు అందించే స్థాయికి పనులు చేరుకున్నాయని తెలిపారు. దీని ద్వారా ఇప్పటికే కొంత స్థిరీకరణ సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ ఏడాది జూన్–జూలై నాటికి సత్తుపల్లి ట్రంక్ పనులు పూర్తిచేసి సత్తుపల్లి మండలాలకు నీళ్లు అందించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు. వచ్చే ఏడాదికి సంబంధించి నాలుగవ పంప్ హౌస్‌తో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సత్తుపల్లి ట్రంక్, నాలుగవ పంప్ హౌస్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను కోరారు.అదేవిధంగా జూలూరుపాడు పనులు పూర్తిచేసి పాలేరు నియోజకవర్గానికి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని, ఎన్టీఆర్ కెనాల్ లింక్ కెనాల్ పనులు పూర్తైతే సత్తుపల్లి నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు పనుల సందర్భంగా రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే మంత్రులు, జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని భూసేకరణ సమస్యలు లేకుండా పరిష్కరించాలని శాసనసభ్యులను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, శాసనసభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఆలస్యం లేకుండా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అనేక పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఈ సమీక్ష సమావేశానికి హాజరైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ్యుల తరఫున, జిల్లా ప్రజల తరఫున, రైతాంగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్‌తో పాటు భారీ నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖలకు చెందిన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :