తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 16 (తెలుగు వెలుగు) : కొత్తగూడెం నియోజక వర్గం, సుజాతనగర్ మండలం స్టేషన్ బేతంపుడి గ్రామం లోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో కీర్తి ధ్వజ స్థంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొని అర్చకులచే ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఆ ఆంజనేయ స్వామి దయతో గ్రామంలో అందరు శుభిష్టంగా ఉండాలని, పాడిపంటలు మంచిగా పండాలన్నారు. ఆయన్ని ఆలయ కమిటీ వాళ్లు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బేతంపూడి రైల్వేస్టేషన్ గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ