తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, వీవోల నిరవధిక సమ్మె కొనసాగుతున్న నేపధ్యంలో అశ్వారావుపేటలో సమ్మె శిబిరాన్ని టీపీసీసీ యూత్ జిల్లా కార్యదర్శి ముడి కృష్ణారావు, నాయకులు మడకం వెంకటేశ్వరరావు, నెల్లపు కొండలరావు, కె.హరీష్, కోచెర్ల శ్రీనివాస్ తదితరులు శుక్రవారం సందర్శించి మద్దతు తెలిపారు. సమ్మె శిబిరాన్ని అన్నపురెడ్డిపల్లిలో సీఎల్పీ మండల కార్యదర్శి జంగి వెంకటరత్నం, చంద్రుగొండలో టీఎస్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు సందర్శించి మద్దతు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ